
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషనర్ల వేతనాలు రెండింతలు పెరిగాయి. సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో సమానంగా వారు వేతనాలు అందుకోనున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌తోపాటు ఎన్నికల సంఘంలో ఉన్న మిగతా ఇద్దరు కమిషనర్లూ ప్రస్తుతం ఉన్న నెలకు రూ.90 వేల బదులు రూ.2.50 లక్షలు అందుకోనున్నారు. పెరిగిన వేతనం 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఇది మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్లు, ఎన్నికల కమిషనర్లకు కూడా వర్తిస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి.