మాల్యా మూడో పెళ్లిపై నెటిజన్ల జోక్స్‌ | Twitter reacts to reports of Vijay Mallya third marriage | Sakshi
Sakshi News home page

మాల్యా మూడో పెళ్లిపై నెటిజన్ల జోకులు

Mar 29 2018 3:06 PM | Updated on Apr 6 2019 9:07 PM

Twitter reacts to reports of Vijay Mallya third marriage - Sakshi

విజయ్‌ మాల్యా, పింకీ లాల్వాణీ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ: ‘భారతీయ బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి లండన్‌కు పారిపోయిన విజయ్‌ మాల్యా మూడో పెళ్లి వెనుక కుట్ర దాగి ఉంది. పింకీ లల్వాణీ మాల్యాని పెళ్లి చేసుకున్న తర్వాత.. తమ కుటుంబాన్ని కలిసేందుకు రమ్మని.. అతన్ని బలవంతపెడుతుంది. అప్పుడు మాల్యా భారత్‌ రాక తప్పదు. అప్పుడు అతన్ని పట్టుకోవచ్చని ఇంటలిజెన్స్‌ వర్గాలు ప్లాన్‌ చేశాయి. ఇది హనీ ట్రాప్‌.. పింకీని ఐబీయే రంగంలోకి దింపింది..’  అంటూ విజయ్‌ మాల్యా మూడో పెళ్లిపై ఓ నెటిజన్‌ వేసిన జోక్‌ ఇది.. ఎయిర్‌ హోస్టెస్‌ పింకీ లాల్వాణీని విజయ్‌ మాల్యా మూడో పెళ్లి చేసుకోబోతున్నాడని జాతీయ మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో విజయ్‌ మాల్యా మూడో పెళ్లి ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారిపోయింది. ఆయన వివాహంపై నెటిజన్లు జోకుల మీద జోకులు వేస్తున్నారు.

విజయ్‌ మాల్యా పెళ్లి రోజున ఎస్‌బీఐ జాతీయ సెలవుదినంగా ప్రకటిస్తుందని ఒక నెటిజన్‌ చమత్కరించగా.. ఇది మాల్యాను పట్టుకునేందుకు ఐబీ పన్నిన హనీట్రాప్‌ అని మరొకరు సెటైర్‌ వేశారు. లండన్‌లో ఒంటరితనం అనుభవించలేక.. మాల్యా మూడో పెళ్లి చేసుకుంటున్నాడని, త్వరలోనే మరో ముగ్గురిని కూడా  అతను చేసుకుంటాడని ఇంకొకరు ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement