ట్రాన్స్‌జెండర్ల ప్రేమ.. చట్టబద్దంగా పెళ్లి..

Transgender Couple Gets Married In Kerala - Sakshi

తిరువనంతపురం, కేరళ : భారత్‌లో లెసిబియన్‌, గే, బై సెక్సువల్‌ అండ్‌ ట్రాన్స్‌జెండర్‌ (ఎల్‌జీబీటీ) కమ్యూనిటీ తొలి విజయం సాధించింది. కేరళ రాష్ట్రంలో ఇషాన్‌, సూర్య అనే ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు చట్టబద్దంగా గురువారం వివాహం చేసుకున్నారు. పురుషుడి భావాలు కలిగిన ఇషాన్, స్త్రీ భావాలు కలిగిన సూర్యలు లింగమార్పిడి ఆపరేషన్లు చేయించుకున్నారు.

ఒకరంటే మరొకరికి ఉన్న అనురాగంతో వివాహం చేసుకున్నారు. తిరువనంతపురంలోని మన్నం మెమోరియల్‌ హాల్‌లో జరిగిన ఈ వేడుకకు ఇరువురి కుటుంబసభ్యులు హాజరయ్యారు. అనంతరం ప్రత్యేక వివాహ చట్టం కింద వివాహాన్ని రిజిస్టర్‌ చేయించుకున్నారు.

ఇషాన్‌, సూర్యలు ట్రాన్స్‌జెండర్‌ జస్టిస్‌ బోర్డులో కొన్నేళ్లుగా సభ్యులు. స్నేహితులు. వీరి వివాహం భారత్‌లో ఎప్పటినుంచో ఎల్‌జీబీటీ కమ్యూనిటీ ఎదుర్కొంటున్న అవమానాల నుంచి విజయంగా భావిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top