భారత్‌ చేతికి మూడు రాఫెల్‌ యుద్ధ విమానాలు

Three Rafale Fighter Jets Handed Over to IAF - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ చేతికి ఇప్పటి వరకూ మూడు రాఫెల్‌ యుద్ధ విమానాలు అందినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం భారత వాయు సేన సిబ్బందికి (ఐఏఎఫ్‌) ఫ్రాన్స్‌లో శిక్షణ అందుతోందని లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా రక్షణ శాఖ సహాయక మంత్రి శ్రీపాద్‌ నాయక్‌ బుధవారం చెప్పారు. తొలి విమానాన్ని రాజ్‌నాథ్‌ అక్టోబర్‌ 8న స్వీకరించారు. రాఫెల్‌ విమానాలను ఫ్రాన్స్‌లోని డసోల్ట్‌ ఏవియేషన్‌ తయారు చేస్తోంది. ప్రస్తుతం భారత్‌ అందుకున్న 3 విమానాల్లో చివరి రెండు ఎప్పుడు అందుకున్నదన్న విషయాన్ని ఆయన చెప్పలేదు. 36 రాఫెల్‌ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్‌తో కేంద్ర ప్రభుత్వం 2016లో దాదాపు రూ.59 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. మొదటి బ్యాచ్‌కు చెందిన 4 రాఫెల్‌ యుద్ధ విమానాలు వచ్చే ఏడాది మే నెలలో మన దేశానికి రానున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top