ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం | Three guerrillas killed in Pulwama district gunfight | Sakshi
Sakshi News home page

ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

Mar 3 2016 9:15 AM | Updated on Sep 3 2017 6:55 PM

జమ్ము కశ్మీర్ పుల్వామా జిల్లాలో గురువారం సైన్యానికి, వేర్పాటువాద గెరిల్లాలలకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

శ్రీనగర్ : జమ్ము కశ్మీర్ పుల్వామా జిల్లాలో గురువారం సైన్యానికి, వేర్పాటువాద గెరిల్లాలలకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. థ్రాల్ పట్టణ సమీపంలో మిలిటెంట్లు తలదాచుకున్నట్లు సమాచారంతో భద్రతా దళాలు బుధవారం సాయంత్రం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.

ఓ భవనంలో దాక్కున్న ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయని, ఈ ఘటనలో ముగ్గురు మిలిటెంట్లు హతమైనట్లు చెప్పారు.  ఘటనాస్థలం నుంచి మూడు ఏకే 47 రైఫిళ్లను, ఎనిమిది మ్యాైగ్జెన్స్‌ను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరోవైపు కాగా ఆప్రాంతంలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement