ఫుడ్ డెలివరీ చేసే డ్రోన్ (ఇన్ సెట్‌లో)
డ్రోన్‌లతో ఫుడ్ డెలవరీ.. కాకా ఫుడ్ డెలవరీ కంపెనీ వినూత్న ఆవిష్కరణ..
లక్నో: హోటల్‌కు ఏదైనా ఆర్డర్ ఇస్తే లేటవుతుందా.. ఆకలి నశించిన తరువాత ఫుడ్ మీ ఇంటికి వస్తుందా.. ట్రాఫిక్ సమస్యతో లేటైంది సార్.. అడ్రస్ దొరకడం కష్టంగా మారింది సార్ అని డెలివరీ బాయ్స్ చెప్పె కాకమ్మ కబుర్లకు చికాకు పడుతున్నారా..? అయితే మీకు ఇలాంటి తిప్పలు త్వరలోనే తప్పనున్నాయి. ఈ సమస్యలకు లక్నోలోని ఆన్‌లైన్ కాకా ఫుడ్ డెలవరీ కంపెనీ వినూత్న పరిష్కారం కనిపెట్టింది.
ఏం లేదండి.. లక్నోలో ట్రాఫిక్ సమస్యలతో ఫుడ్ డెలివరీ కష్టంగా మారిందనీ.. గాల్లో ఫుడ్ డెలివరీ చేయాలనే ఆలోచన తట్టింది ఈ కంపెనీకి. ఇక ఆలోచన తట్టడమే ఆలస్యం వెంటనే కార్యచరణ రూపొందించింది. అదేనండి డ్రోన్ కెమెరాలతో వీడియోలు తీసినట్లే డ్రోన్‌లతో ఫుడ్ డెలివరీ చేస్తే ఎలా ఉంటందని.. ఆలోచించి విజయవంతమైంది. దీంతో డెలివరీ టైమ్‌లో 1/3 వంతు తగ్గిందటా..అంతేకాదండోయ్ టూ వీలర్ అవసరం ఉండదని దీంతో పొగకాలుష్యం కూడా తగ్గుతుందని చెబుతోంది.
దీన్ని రూపొందించడానికి కాకా ఆన్‌లైన్ ఉద్యోగులు అహద్ అర్షద్, మొహద్ బిలాల్‌లు ఒక సంవత్సరం పాటు కష్టపడ్డారట.. ఇప్పటికే వీటిని టెస్టు డ్రైవ్ నిర్వహించామని అయితే కేంద్రవిమానాయ శాఖ, లక్నో డీఎంల నుంచి అనమతుల కోసం వేచిచూస్తున్నామంటున్నాడు కంపెనీ సోషల్ మీడియా మేనెజర్ వివేక్ కుమార్. ఈ కంపెనీకి అనుమతులు లభిస్తే నార్త్ ఇండియాలోను నెం.1 డెలవరీ కంపెనీ నిలవనుంది.