'జయప్రదతో విభేదాలు లేవు' | There are no differences beween me and Jaya Prada ji: Amar Singh | Sakshi
Sakshi News home page

'జయప్రదతో విభేదాలు లేవు'

May 18 2016 8:34 PM | Updated on Sep 4 2017 12:23 AM

'జయప్రదతో విభేదాలు లేవు'

'జయప్రదతో విభేదాలు లేవు'

జయప్రదకు, తనకు ఎటువంటి విభేదాలు లేవని సమాజ్ వాది పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన అమర్ సింగ్ తెలిపారు.

లక్నో: జయప్రదకు, తనకు ఎటువంటి విభేదాలు లేవని సమాజ్ వాది పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన అమర్ సింగ్ తెలిపారు. ములాయం సింగ్ మన్ననలు చూరగొనడం పట్ల ఆయన అమితానందం వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యత్వం కంటే ములాయం దీవెనలు పొందడమే తనకు ముఖ్యమని చెప్పారు.

కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్ తన ఫోన్ చేసి అభినందలు తెలిపారని, ఆయన ఎందుకు అభినందలు తెలిపారో ముందు అర్థం కాలేదన్నారు. తర్వాత రోజు ములాయంతో మాట్లాడినప్పుడు తనను రాజ్యసభకు ఎంపిక చేశారని తెలిసిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జయాబచ్చన్ తో విభేదాల గురించి అడిగినప్పుడు ఆయన సూటిగా సమాధానం చెప్పలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement