రైలు టికెట్‌పై పది పైసల సెస్‌! | Ten paise cess on the train ticket! | Sakshi
Sakshi News home page

రైలు టికెట్‌పై పది పైసల సెస్‌!

Jan 2 2017 2:53 AM | Updated on Sep 5 2017 12:08 AM

రైల్వే టికెట్‌పై కొత్తగా పది పైసలు సెస్‌గా విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

కేంద్ర ప్రభుత్వ యోచన
న్యూఢిల్లీ: రైల్వే టికెట్‌పై కొత్తగా పది పైసలు సెస్‌గా విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విధంగా వచ్చిన ఆదాయంతో రైల్వే శాఖలో పనిచేసే సుమారు 20 వేల మంది కూలీలను సామాజిక రక్షణ పథకాల పరిధిలోకి తీసుకురావాలని భావిస్తోంది.  రైల్వే శాఖ 58 శాతం రిజర్వ్‌డ్‌ టికెట్లతో సహా ప్రతిరోజూ 10 – 12 లక్షల టికెట్లను విక్రయిస్తుంది. పది పైసలు సెస్‌ ద్వారా ప్రతిరోజూ సుమారు రూ. 1.2 లక్షలు.. ఏడాదికి సుమారు 4.38 కోట్లు సమకూరుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఈ నిధులు కూలీలకు పీఎఫ్, పింఛన్, సామూహిక బీమా తదితర సదుపాయాల కల్పనకు సరిపోతాయని భావిస్తోంది. సెస్‌ ద్వారా కూలీలకు సామాజిక రక్షణ పథకాలు వర్తింప జేయాలని గత నెల 19న బెంగళూరులో జరిగిన సీబీటీ సమావేశంలో ప్రతి పాదించారు. రాబోయే బడ్జెట్‌లో సెస్‌ విధింపు ప్రకటన ఉండవచ్చని కార్మిక మంత్రిత్వ శాఖ ఆశాభావంతో ఉంది.

తేజస్‌ రైళ్లలో సంజీవ్‌ కపూర్‌ వంటకాలు
ఈ ఏడాది ప్రవేశపెట్టనున్న తేజస్‌ రైళ్లలో ప్రయాణికులకు పాకశాస్త్ర నిపుణుడు సంజీవ్‌ కపూర్‌ రూపొందించిన వంటకాలను వడ్డించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement