
'బిల్లుతో తెలంగాణకు కొంత నష్టం, కొంత లాభం'
జీఎస్‌టీ బిల్లుకు షరతులతో కూడిన మద్దతు ఇస్తున్నామని తెలంగాణ ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు.
ఢిల్లీ: జీఎస్‌టీ బిల్లుకు షరతులతో కూడిన మద్దతు ఇస్తున్నామని తెలంగాణ ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ జీఎస్‌టీ బిల్లుతో తెలంగాణ రాష్ట్రానికి కొంత నష్టం, కొంత లాభం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణకు జరిగే నష్టాన్ని పూడ్చిలే చట్టంలో రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు.
రూ. 70 వేల కోట్ల అప్పుతో తెలంగాణ ఏర్పడిందని చెప్పారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచాలని పదేపదే కేంద్రాన్ని కోరుతున్నామని అన్నారు. కేంద్రం నుంచి రూ.10 వేల కోట్ల సీఎస్‌సీ బకాయిలు రావాలని ఈటల డిమాండ్ చేశారు.