ఆ దేవాలయమంతా కరెన్సీ నోట్లే..!

For Tamil New Year, Chennai Temple Decorated With Currency Notes - Sakshi

చెన్నై : తమిళ నూతన సంవత్సర ‘పుథాండు’ సందర్భంగా చెన్నైలోని అరబ్బక్కంలో బాల వినయానగర్‌ దేవాలయంలోకి ఎప్పుడైనా ప్రవేశించారా... అయితే ఒక్కసారి వెళ్లి చూడండి.. ఆ దేవాలయమంతా ఆ రోజు కరెన్సీ నోట్ల కట్టలతోనే దర్శనిమిస్తోందట. పుథాండు పర్వదినాన ఆ దేవాలయాన్ని పూలు, కాంతి వెలుగులతో కాకుండా.. తమిళ ప్రజలు కరెన్సీ నోట్లతో అలంకరిస్తారట. పుథాండు సందర్భంగా ఆ దేవాలయమంతా గోడలు, దిమ్మెలు అన్నీ కూడా రూపాయి నోటు నుంచి రూ.200 నోటు వరకున్న డినామినేషన్‌ నోట్లతోనే కళకళలాడుతుంటాయని అక్కడి భక్తులు చెబుతున్నారు. 

ప్రతేడాది తమిళ కొత్త ఏడాది సందర్భంగా ఈ గుడిని ఇలానే అలంకరిస్తామని దేవాలయ నిర్వాహకులు చెప్పారు. ఈ గుడిలో ఉండే గణేశుడి విగ్రహాన్ని కూడా నోట్ల కట్టలతో తీర్చిదిద్దుతామని తెలిపారు. ఒక గోడ నుంచి మరో గోడకు కరెన్సీ నోట్లను అమర్చడానికి సుమారు రూ.4 లక్షల విలువైన నోట్లు అవసరం పడతాయని చెప్పారు. అయితే ఈ నగదంతా నిజమైనదే అని కచ్చితంగా చెప్పలేమంటున్నారు అక్కడి భక్తులు. పుథాండు అనేది తమిళ ప్రజల కొత్త సంవత్సరం, తమిళ క్యాలెండర్‌లో తొలి రోజు. ప్రతేడాది ఈ రోజు 14వ తేదీ ఏప్రిల్‌లో వస్తుంటోంది. ఈ రోజును కేరళలో విశు, అస్సాంలో బిహు అని జరుపుకుంటుంటారు. 

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top