జయకు మద్దతుగా డిస్ట్రిబ్యూటర్ల నిరాహార దీక్షలు | Tamil film exhibitors to fast in support of Jayalalithaa | Sakshi
Sakshi News home page

జయకు మద్దతుగా డిస్ట్రిబ్యూటర్ల నిరాహార దీక్షలు

Sep 29 2014 2:56 PM | Updated on Oct 2 2018 2:40 PM

జయలలితకు జైలుశిక్ష పడిందని తెలిసి, ఆమెకు సంఘీభావంగా నిరాహార దీక్షలు చేపట్టాలని తమిళనాడు సినిమా ఎగ్జిబిటర్ల సంఘం నిర్ణయించింది.

తమిళనాడులో సినిమా వాళ్లన్నా.. రాజకీయ నాయకులన్నా విపరీతమైన ఆరాధన ఉంటుంది. అందులోనూ సినిమాల నుంచి వచ్చిన నాయకులంటే ఇక చెప్పనక్కర్లేదు. అందుకే జయలలితకు జైలుశిక్ష పడిందని తెలిసి, ఆమెకు సంఘీభావంగా నిరాహార దీక్షలు చేపట్టాలని తమిళనాడు సినిమా ఎగ్జిబిటర్ల సంఘం నిర్ణయించింది.

మంగళవారం నాడు తమిళనాడులోని అన్ని థియేటర్లలో షోలన్నింటినీ రద్దుచేశారు. అమ్మకు తాము మద్దతుగా ఉంటామని, తీర్పుపై తాము వ్యాఖ్యానించలేం గానీ, సినీ పరిశ్రమకు ఆమె చాలా చేశారని, అందుకే ఆమెకు మద్దతుగా ఉండాలనుకుంటున్నామని సంఘం సభ్యుడొకరు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement