‘జస్టిస్‌ గొగోయ్‌’ పిటిషన్‌ కొట్టివేత

Supreme Court dismisses plea challenging appointment of Justice Ranjan Gogoi as next CJI - Sakshi

న్యూఢిల్లీ: తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ఈ పిటిషన్‌లో విచారణార్హమైన అంశాలేవీ లేవని అభిప్రాయపడింది. జస్టిస్‌ గొగోయ్‌ నియామకంపై ఈ దశలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది. విచారణ సందర్భంగా పిటిషన్‌ దాఖలుచేసిన లాయర్లు ఆర్పీ లూథ్రా, సత్యవీర్‌ శర్మ వాదిస్తూ.. జస్టిస్‌ గొగోయ్‌ నియామకాన్ని రద్దు చేయాలని కోరారు. సీజేఐ జస్టిస్‌ మిశ్రా వ్యవహారశైలిని గతంలో మీడియాసమావేశంలో జస్టిస్‌ గొగోయ్‌ తప్పుబట్టడం తెల్సిందే. ఈ చర్యలు దేశ న్యాయవ్యవస్థకు ద్రోహం చేయడం కన్నా తక్కువేమీ కాదనీ, ఈ మీడియా సమావేశం ద్వారా దేశ ప్రజల్లో ఆందోళన రేకెత్తించేలా నలుగురు న్యాయమూర్తులు వ్యవహరించారని వ్యాఖ్యానించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top