‘ఫొని’ భీభత్సం.. క్రేన్‌, బస్సు ఉఫ్‌!!.. వైరల్‌

Super Cyclone Fani Effect In Orissa - Sakshi

భువనేశ్వర్‌ : వాయువేగంతో ఒడిశా తీరం వైపు దూసుకువచ్చిన ఫొని తుపాను శుక్రవారం ఉదయం పూరి సమీపంలో తీరం దాటింది. దీని ప్రభావంతో పూరి తీరప్రాంతంలో గంటకు 180–200 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.  ఈ పెనుగాలుల దాటికి నిన్న భువనేశ్వర్‌లో భవననిర్మాణాలకు ఉపయోగించే పెద్ద క్రేన్‌ ఒకటి నేల కొరిగింది. అంతేకాకండా ఓ పెద్ద బస్సుసైతం గాలుల దాటికి అట్టముక్కలా కొట్టుకుపోయింది.

ఇక బైకులు, చిన్న చిన్న వాహనాల సంగతైతే చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫొని సృష్టించిన ప్రళయ కాల భీభత్సం దాటికి ఇప్పటివరకు 8 మంది మృత్యువాత పడగా.. వేలకోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top