ఫిరాయింపులతో రాష్ట్రానికి కళంకం తెచ్చారు | SS sampath kumar fires on TRS party | Sakshi
Sakshi News home page

ఫిరాయింపులతో రాష్ట్రానికి కళంకం తెచ్చారు

Nov 9 2016 4:28 AM | Updated on Sep 4 2017 7:33 PM

ఫిరాయింపులతో రాష్ట్రానికి కళంకం తెచ్చారు

ఫిరాయింపులతో రాష్ట్రానికి కళంకం తెచ్చారు

ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాష్ట్రానికి కళంకం తెచ్చారని టీఆర్‌ఎస్ పార్టీపై కాంగ్రెస్ విప్ ఎస్.ఎస్.సంపత్‌కుమార్

టీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ విప్ సంపత్‌కుమార్
సాక్షి, న్యూఢిల్లీ: ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాష్ట్రానికి కళంకం తెచ్చారని టీఆర్‌ఎస్ పార్టీపై కాంగ్రెస్ విప్ ఎస్.ఎస్.సంపత్‌కుమార్ మండిపడ్డారు. మంగళవారం సుప్రీంకోర్టు వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘టీఆర్‌ఎస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడి దాన్ని కప్పి పుచ్చుకోడానికి రూ.లక్షల్లో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ పెద్ద పెద్ద న్యాయవాదులను నియమించుకుంది.

అయినప్పటికీ రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు నివేదించింది. అనేక ప్రశ్నలు లేవనెత్తింది. అనర్హత పిటిషన్లపై జరిగిన జాప్యాన్ని ప్రశ్నించింది. తాజా ఉత్తర్వులతో న్యాయ వ్యవస్థపై మరింత విశ్వాసం పెరిగింది’అన్నారు. ఇప్పటికై నా ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement