జమ్మూలో గ్రెనేడ్‌ దాడి చేసింది 9వ తరగతి విద్యార్థి! | Sources  Says Class 9 Student Hid Grenade In Lunchbox | Sakshi
Sakshi News home page

జమ్మూలో గ్రెనేడ్‌ దాడి చేసింది 9వ తరగతి విద్యార్థి!

Published Fri, Mar 8 2019 2:25 PM | Last Updated on Fri, Mar 8 2019 3:26 PM

Sources  Says Class 9 Student Hid Grenade In Lunchbox - Sakshi

గ్రెనేడ్‌ను లంచ్‌ బాక్స్‌లో తీసుకొచ్చి జమ్మూ ఆర్టీసీ బస్టాండ్‌ లక్ష్యంగా

జమ్మూ: జమ్మూలో గ్రెనేడ్‌ దాడి జరిపింది 9వ తరగతి విద్యార్థేనని నిఘావర్గాలు పేర్కొన్నాయి. నిందితుడు గ్రెనేడ్‌ను లంచ్‌ బాక్స్‌లో తీసుకొచ్చి జమ్మూ ఆర్టీసీ బస్టాండ్‌ లక్ష్యంగా దాడి జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 32 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. దాడి జరిపి తిరుగు ప్రయాణమైన దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్‌కు చెందిన నిందితుడిని పోలీసులు జమ్ముకు 20 కిలోమీటర్ల సమీపంలోని చెక్‌పాయింట్‌ వద్ద అదుపులోకి తీసుకున్నారు. మైనర్‌ అయిన నిందితుడు యూట్యూబ్‌ సాయంతో గ్రేనేడ్‌ తయారు చేశాడని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇక నిందితుడు జమ్ముకు రావడం ఇదే తొలిసారని, అతను కారులో బుధవారమే ఇక్కడికి చేరాడని పేర్కొన్నారు. అతన్ని తీసుకొచ్చిన కారు డ్రైవర్‌ కోసం కూడా గాలిస్తున్నామన్నారు. మైనర్‌ అయిన నిందితుడు ఒక్కడే 250 కిలోమీటర్లు ఎలా ప్రయాణించాడు?  అది వన్‌వే ట్రాఫిక్‌ కలిగిన శ్రీనగర్‌-జమ్ము నేషనల్‌ హైవేపై ఎలా సాధ్యం అనే ప్రశ్నలు తలెత్తున్నాయి.

మరోవైపు ఈ ఘటనపై జమ్మూ ఐజీ ఎంకే సిన్హా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిందితుడిని నగ్రోటా టోల్‌ప్లాజా దగ్గర పట్టుకున్నామనీ, హిజ్బుల్‌ సంస్థ కుల్గాం జిల్లా కమాండర్‌ ఫరూఖ్‌ అహ్మద్‌ భట్‌తో అతను మాట్లాడినట్లు తేలిందని చెప్పారు. ఫరూఖ్‌ తనకు గ్రెనేడ్‌ను కుల్గాంలో అందజేశాడనీ, గురువారం ఉదయం జమ్మూ చేరుకున్నానని విచారణలో నిందితుడు చెప్పాడన్నారు.  జమ్మూలో మతసామరస్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడికి పాల్పడ్డారని పేర్కొన్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement