గోవాకు సోనియా ప్రైవేట్‌ విజిట్‌ | Sonia Gandhi on private visit to Goa | Sakshi
Sakshi News home page

గోవాకు సోనియా ప్రైవేట్‌ విజిట్‌

Sep 27 2017 8:38 PM | Updated on Oct 22 2018 9:16 PM

 Sonia Gandhi on private visit to Goa - Sakshi

పనాజీ : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గోవాకు వచ్చారు. ఓ ప్రైవేట్‌ విమానంలో బుధవారం మధ్యాహ్నం గోవా చేరుకున్న ఆమె ఓ ఫైవ్‌ స్టార్‌ రిసార్ట్‌లో దిగారు. సౌత్‌ గోవా మోబోర్‌ బీచ్‌కు దగ్గరగా ఈ రిసార్ట్‌ ఉంటుంది. గురువారం మధ్యాహ్నం తిరిగి ఆమె అక్కడి నుంచి బయలుదేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

విశ్రాంతి తీసుకునేందుకు ఆమె వచ్చినట్లు సన్నిహితవర్గాల సమాచారం. ఇక గోవా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ప్రతిమా కౌటినో మాట్లాడుతూ గోవాకు సోనియాగాంధీ తరుచూ వస్తుంటారని, అది తమకు గౌరవంగా ఉంటుందని తెలిపారు. 'విశ్రాంతికోసం మా పార్టీ అధ్యక్షురాలు గోవాకు రావడం మాకు గర్వంగా ఉంటుంది' అని చెప్పారు. ఆమెతో గోవా కాంగ్రెస్‌ పార్టీ నేతలు భేటీ అవనున్నారా అని ప్రశ్నించగా కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శి గిరీష్‌ చోదాంకర్‌ స్పందిస్తూ 'ఆమె వ్యక్తిగత పర్యటన నిమిత్తం వస్తే కచ్చితంగా ఎవరూ డిస్ట్రబ్‌ చేయకూడదు' అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement