breaking news
private aeroplane
-
గోవాకు సోనియా ప్రైవేట్ విజిట్
పనాజీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గోవాకు వచ్చారు. ఓ ప్రైవేట్ విమానంలో బుధవారం మధ్యాహ్నం గోవా చేరుకున్న ఆమె ఓ ఫైవ్ స్టార్ రిసార్ట్‌లో దిగారు. సౌత్ గోవా మోబోర్ బీచ్‌కు దగ్గరగా ఈ రిసార్ట్ ఉంటుంది. గురువారం మధ్యాహ్నం తిరిగి ఆమె అక్కడి నుంచి బయలుదేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విశ్రాంతి తీసుకునేందుకు ఆమె వచ్చినట్లు సన్నిహితవర్గాల సమాచారం. ఇక గోవా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రతిమా కౌటినో మాట్లాడుతూ గోవాకు సోనియాగాంధీ తరుచూ వస్తుంటారని, అది తమకు గౌరవంగా ఉంటుందని తెలిపారు. 'విశ్రాంతికోసం మా పార్టీ అధ్యక్షురాలు గోవాకు రావడం మాకు గర్వంగా ఉంటుంది' అని చెప్పారు. ఆమెతో గోవా కాంగ్రెస్ పార్టీ నేతలు భేటీ అవనున్నారా అని ప్రశ్నించగా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి గిరీష్ చోదాంకర్ స్పందిస్తూ 'ఆమె వ్యక్తిగత పర్యటన నిమిత్తం వస్తే కచ్చితంగా ఎవరూ డిస్ట్రబ్ చేయకూడదు' అని అన్నారు. -
తప్పిన ముప్పు..
శనివారం ఫిలిప్పీన్స్‌లోని టక్లోబాన్‌లో ఉన్న విమానాశ్రయంలో టేకాఫ్ సమయంలో ముందు వైపున్న టైర్లు పేలడంతో రన్‌వే నుంచి పక్కకు వెళ్లిన ప్రైవేట్ విమానం. ఫిలిప్పీన్స్ పర్యటనకు వచ్చిన పోప్ ఫ్రాన్సిస్‌తోపాటు ఉన్న ఆ దేశ మంత్రులు, అధికారులు ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.