కులాలకు అతీతంగా ఒకే చట్టం ఉండాలి: సుప్రీం | SC-SC/ST Laws Should Be Caste Neutral | Sakshi
Sakshi News home page

కులాలకు అతీతంగా ఒకే చట్టం ఉండాలి: సుప్రీం

May 2 2019 4:34 AM | Updated on May 2 2019 4:34 AM

SC-SC/ST Laws Should Be Caste Neutral - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో చట్టాలు పౌరులందరికీ సమానంగా, కులాలకు అతీతంగా ఉండాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఎస్టీ,ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంపై గతంలో ఇచ్చిన తీరును పునఃసమీక్షించాలని దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం బుధవారం విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా జస్టిస్‌ అరుణ్‌మిశ్రా, జస్టిస్‌ యు.యు.లలిత్‌ల ధర్మాసనం స్పందిస్తూ.. ‘దేశంలో జనరల్‌ కేటగిరీకి ఓ చట్టం, ఎస్సీ,ఎస్టీలకు మరో చట్టం ఉండటానికి వీల్లేదు. అందరికీ ఒకే చట్టం ఉండాలి’ అని వ్యాఖ్యానించింది. అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ స్పందిస్తూ.. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు సమస్యాత్మకంగా మారిందనీ, దీన్ని సమీక్షించాలని కోరారు. దీన్ని వికాస్‌సింగ్‌ అనే న్యాయవాది వ్యతిరేకించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం, తీర్పును రిజర్వులో ఉంచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement