రాష్ట్రాలపై సుప్రీం ఆగ్రహం | SC says states not spending money meant for urban homeless shelters | Sakshi
Sakshi News home page

రాష్ట్రాలపై సుప్రీం ఆగ్రహం

Sep 14 2017 3:43 AM | Updated on Sep 19 2017 4:30 PM

రాష్ట్రాలపై సుప్రీం ఆగ్రహం

రాష్ట్రాలపై సుప్రీం ఆగ్రహం

పట్టణ ప్రాంత నిరాశ్రయుల కోసం కేంద్రం కేటాయించిన నిధులను రాష్ట్రాలు సక్రమంగా ఖర్చు చేయటం లేదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

న్యూఢిల్లీ: పట్టణ ప్రాంత నిరాశ్రయుల కోసం కేంద్రం కేటాయించిన నిధులను రాష్ట్రాలు సక్రమంగా ఖర్చు చేయటం లేదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై కాగ్‌తో ఆడిట్‌ చేయించాలని కేంద్రానికి సూచించింది. జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్‌ నిధులు పక్కదారి పట్టడంపై జస్టిస్‌ మదన్‌ బి. లోకూర్, జస్టిస్‌ దీపక్‌ గుప్తాలతో కూడిన బుధవారం ధర్మాసనం విచారిం చింది. కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ రంజిత్‌ కుమార్‌ వాదనలు వినిపిస్తూ  పథ కం కింద కేంద్రం గతేడాది కేటాయించిన నిధుల్లో రూ.412 కోట్లను రాష్ట్రాలు ఖర్చు చేయలేదని సుప్రీంకు తెలిపారు.  

Advertisement

పోల్

Advertisement