చిదంబరం బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐకి సుప్రీం నోటీసులు

SC Issues Notice To CBI On P Chidambarams Bail Plea - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై బదులివ్వాలని కోరుతూ సుప్రీం కోర్టు శుక్రవారం సీబీఐకి నోటీసులు జారీ చేసింది. చిదంబరం బెయిల్‌ పిటిషన్‌పై జస్టిస్‌ ఆర్‌ భానుమతి, జస్టిస్‌ హృషీకేష్‌ రాయ్‌ల నేతృత్వంలోని సుప్రీం బెంచ్‌ సీబీఐ తరపున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను బదులివ్వాలని కోరుతూ తదుపరి విచారణను ఈనెల 15కి వాయిదా వేసింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్ట్‌ అయిన చిదంబరం ప్రస్తుతం జ్యుడిషియల్‌ కస్టడీ కింద తిహార్‌ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో బెయిల్‌ అప్పీల్‌ను తోసిపుచ్చుతూ సెప్టెంబర్‌ 30న ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ చిదంబరం సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. అవినీతి కేసులో ఆగస్ట్‌ 21న అరెస్టయినప్పటి నుంచి చిదంబరం సీబీఐ కస్టడీలో ఉన్నారు. ఇదే కేసుకు సంబంధించి 2017లో చిదంబరంపై ఈడీ మనీల్యాండరింగ్‌ కేసు నమోదు చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top