కనీస పెన్షన్ రూ.1000 | Rs.1,000 minimum pension to continue | Sakshi
Sakshi News home page

కనీస పెన్షన్ రూ.1000

Apr 29 2015 5:26 PM | Updated on Sep 3 2017 1:07 AM

పింఛన్దారులకు నెలకు కనీసం వెయ్యి రూపాయల పెన్షన్ కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

న్యూఢిల్లీ: ఉద్యోగుల పెన్షన్ పథకం కింద పింఛన్దారులకు నెలకు కనీసం వెయ్యి రూపాయల పెన్షన్ కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం కేంద్ర కేబినెట్ ఈ మేరకు ఆమోదముద్ర వేసింది. కనీస పెన్షన్ పథకం మార్చి 2015తో గడువు ముగిసింది. కేబినెట్ తాజా నిర్ణయంతో పింఛనదారులకు ఊరట లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రమంత్రి వర్గం సమావేశమైంది. కనీస పెన్షన్ పథకం అమలు చేయడానికి ఏడాదికి 850 కోట్ల రూపాయల నిధులను ఇవ్వడానిఇకి కేబినెట్ ఆమోదించింది. ఈ నిర్ణయం వల్ల 20 లక్షల మంది ఫించన్దారులకు లబ్ధి కలగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement