హిందీ దివస్‌: మాతృభాషను మరువరాదు

Respect all languages, cultures equally, Says Mamata Banerjee - Sakshi

అన్ని భాషలనూ గౌరవించాలి

మమతా బెనర్జీ ట్వీట్‌

కోల్‌కతా: హిందీ దివస్‌ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అన్ని భాషలను, సంస్కృతులను సమానంగా గౌరవించాల్సిన అవసరముందని ఆమె ఈ సందర్బంగా పేర్కొన్నారు. ‘హిందీ దివస్‌ సందర్భంగా నా శుభాకాంక్షలు. అన్ని భాషలను, సంస్కృతులను మనం సమానంగా గౌరవించాల్సిన అవసరముంది. మనం ఎన్నో భాషలను నేర్చుకోవచ్చు కానీ, మాతృభాషను మరువరాదు’ అని ఆమె ట్వీట్‌ చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా హిందీ దివస్‌ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ తదితరలు హిందీ దివస్‌ సందర్భంగా ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ఇక, ఏకీకృత భాషగా హిందీని అమలు చేయడం ద్వారా దేశ పౌరులందరినీ ఏకతాటిపైకి తీసుకురావచ్చన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ, డీఎంకే ప్రెసిడెంట్‌ స్టాలిన్‌ షా వ్యాఖ్యలపై మండిపడ్డారు.

చదవండి: అమిత్‌ షా వ్యాఖ్యలు షాకిచ్చాయ్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top