అత్యాచారం చేయబోతే.. చెప్పుతో దేహశుద్ధి | Rape Attempt On Woman In Hubballi Victim Teaches Perpetrators A Lesson | Sakshi
Sakshi News home page

అత్యాచారం చేయబోతే.. చెప్పుతో కొట్టింది

Mar 13 2018 10:21 AM | Updated on Jul 28 2018 8:51 PM

Rape Attempt On Woman In Hubballi Victim Teaches Perpetrators A Lesson - Sakshi

హుబ్లి : ఇటీవల మహిళలపై జరుగుతున్న అసభ్య ప్రవర్తనలు, లైంగిక వేధింపులు తరుచుగా వింటూనే ఉన్నాం. బస్సులో, బస్‌స్టాపుల్లో, ఆఫీసుల్లో, ఇతరత్రా ప్రదేశాల్లో ఒంటరిగా ఉన్న మహిళలను ఆకతాయిలు వేధిస్తూ ఉన్నారు. తాజాగా కర్ణాటక హుబ్లి బస్సు డిపోలో ఇలాంటిదే ఒక షాకింగ్‌ సంఘటన జరిగింది. 55 ఏళ్ల మహిళ తన సొంతూరుకు వెళ్లేందుకు హుబ్లీ బస్టాండ్‌కు వచ్చింది. అయితే బస్సు అప్పటికే వెళ్లిపోవడంతో.. ఆమె రాత్రి సమయంలో బస్టాండ్‌లోనే ఉండిపోయింది. మహిళ ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఇద్దరు వ్యక్తులు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో ఆ మహిళ ఏమాత్రం జంకకుండా.. వెంటనే వారిద్దరినీ లాగిపెట్టి చెప్పుతో కొట్టింది.  ఆమె అరుపులు విని, పక్కనే నిద్రిస్తున్న వారు కూడా లేచి, ఆకతాయిలకు తగిన గుణపాఠం చెప్పారు. అయితే ఆ ఇద్దరినీ పోలీసులకు అప్పగించేలోపే అక్కడ నుంచి తప్పించుకుని పారిపోయారు. మార్చి 11న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement