పాలిటిక్స్‌కు బై : సినిమాల్లోకి ఆ నటి రీఎంట్రీ..

Ramya Hints At Quitting Politics To Come Back Into Movies - Sakshi

బెంగళూర్‌ : సినిమాల్లో క్రేజీ నటిగా వెలుగొందుతున్న సమయంలోనే క్రియాశీల రాజకీయాల్లోకి వెళ్లిన కన్నడ నటి రమ్య తిరిగి మూవీల్లో నటించేందుకు సంసిద్ధమనే సంకేతాలు పంపారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ సరసన అభి మూవీలో నటించడం ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించిన రమ్య తక్కువ సమయంలోనే కన్నడ చిత్రసీమలో టాప్‌ హీరోయిన్‌గా ఎదిగారు. అ‍యితే ముక్కుసూటిగా మాట్లాడే ధోరణితో ఆమె వివాదాస్పద నటిగా పేరొందారు. 2013లో రాజకీయాల్లో అడుగుపెట్టిన రమ్య 2017లో కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా హెడ్‌గా బాధ్యతలు చేపట్టడంతో సినిమాలకు దూరమయ్యారు.

ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయంతో ఆమె సోషల్‌ మీడియా బాధ్యతల నుంచి వైదొలిగారు. తనకు ఇప్పటికీ ఆఫర్లు వస్తున్నాయని, వాటిని తాను అంగీకరించలేదని, అయితే సినిమాల్లో తిరిగి పనిచేయడం తనకు ఫన్‌గానే ఉంటుందని, దీనిపై ఇప్పడే ఏమీ చెప్పలేనని ఓ ఆంగ్ల దినపత్రికతో మాట్లాడుతూ చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top