నిలకడగా పాశ్వాన్‌ ఆరోగ్యం | Ramvilas Paswan stable, doctors keep watch over him in ICU | Sakshi
Sakshi News home page

నిలకడగా పాశ్వాన్‌ ఆరోగ్యం

Jan 13 2017 12:55 PM | Updated on Sep 5 2017 1:11 AM

కేంద్ర మంత్రి రాం విలాస్‌ పాశ్వాన్‌ ఆర్యోగం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

పట్నా : అస్వస్థతకు గురైన కేంద్ర మంత్రి రాం విలాస్‌ పాశ్వాన్‌ ఆర్యోగం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శ్వాసకోస ఇబ్బందులతో ఆయనను నిన్న రాత్రి ఢిల్లీలోని పరాస్‌ ప్రయివేట్‌ ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. పాశ్వాన్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి కార్డియాలస్ట్‌ హెడ్‌ డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌ తెలిపారు.

ఆయన ఆరోగ్యంపై వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. పాశ్వాన్‌కు ఐసీయూలోనే చికిత్స కొనసాగిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు పాశ్వాన్‌ ఆరోగ్యం మెరుగు పడగానే వైద్యుల సిఫార్సు మేరకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఓఎస్డీ ఆర్‌సీ మీనా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement