నేడు కశ్మీర్‌కు కోవింద్‌ | Ramnath kovind Go to kashmir | Sakshi
Sakshi News home page

నేడు కశ్మీర్‌కు కోవింద్‌

Jun 28 2017 2:12 AM | Updated on Sep 5 2017 2:36 PM

నేడు కశ్మీర్‌కు కోవింద్‌

నేడు కశ్మీర్‌కు కోవింద్‌

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేడు జమ్మూ కశ్మీర్లో పర్యటించనున్నారు..

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక ప్రచారంలో భాగంగా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నా«థ్‌ కోవింద్‌ నేడు జమ్మూ కశ్మీర్లో పర్యటించనున్నారు. ఆయనతో పాటు  కేంద్రమం త్రి వెంకయ్య నాయుడు ప్రచారంలో పాల్గొంటారు. జూలై 4న రామ్‌నా«థ్‌ కోవింద్‌ తెలుగు రాష్ట్రాలలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా 4 వ తేదీ ఉదయం హైదరాబాద్‌కు చేరుకుంటారు.

ఆ తర్వాత పార్క్‌ హోటల్లో వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలను కలుసుకోనున్నారు. మధ్యాహ్నం నెక్లెస్‌రోడ్‌ లోని జలవిహార్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. సీఎం కేసీఆర్‌తో భోజనం అనంతరం విజయవాడ వెళ్లి ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమవుతారు.

Advertisement
 
Advertisement
Advertisement