'మేము ఒక్కరోజు విశ్రాంతి తీసుకోలేదు' | Rajnath Singh Says We Did Not Take Rest For A Day In 100 Days | Sakshi
Sakshi News home page

'మేము ఒక్కరోజు విశ్రాంతి తీసుకోలేదు'

Sep 8 2019 10:17 PM | Updated on Sep 8 2019 10:17 PM

Rajnath Singh Says We Did Not Take Rest For A Day In 100 Days - Sakshi

ఘజియాబాద్‌ : ప్రధాని మోధీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 100 రోజుల పాలనలో ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోలేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పేర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో నిర్వహించిన ఓ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రెండోసారి అధికారంలోకి వచ్చి 100 రోజులు  పూర్తి చేసుకున్నప్పటికి మా ప్రభుత్వం ఏ ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకోలేదని చెప్పారు. ఈ వందరోజుల్లో అద్భుత పనితీరును కనబరిచామని, ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నామని రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం దిశా నిర్దేశం లేని ప్రభుత్వం అంటూ ఆర్థిక వ్యవస్థనుద్దేశించి విమర్శలు చేస్తుందని మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement