10 నుంచి కర్ణాటకలో రాహుల్‌ పర్యటన

Rahul Gandhi to visit Karnataka from Feb 10-12 for first leg - Sakshi

న్యూఢిల్లీ: కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ ఫిబ్రవరి 10 నుంచి 12వ తేదీ వరకు తమ రాష్ట్రంలో పర్యటిస్తారని కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు పరమేశ్వర తెలిపారు. రాహుల్‌ ప్రచారం బెంగళూరు నుంచి ప్రారంభమవుతుందన్నారు. ఈ పర్యటనలో ఆయన రైతులు, మేధావులు, విద్యార్థులతో పాటు వివిధ రంగాల వారిని కలుసుకుని మాట్లాడతారన్నారు. కర్ణాటక అసెంబ్లీకి మార్చి లేదా ఏప్రిల్‌లో ఎన్నికలు జరగనున్నాయి. 

Back to Top