చిక్కుల్లో ఆప్ సర్కారు | Quran desecration: Setback for AAP as Delhi MLA Naresh Yadav booked for trying to incite riots in Punjab | Sakshi
Sakshi News home page

చిక్కుల్లో ఆప్ సర్కారు

Jul 3 2016 7:27 PM | Updated on Sep 4 2017 4:03 AM

ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు,ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ లో మూడు రోజులు పర్యటించనున్న నేపథ్యంలో ఆపార్టీ చిక్కుల్లో పడింది.

న్యూఢిల్లీ:   ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ లో మూడు రోజులు పర్యటించనున్న నేపథ్యంలో  ఆపార్టీ చిక్కుల్లో పడింది. పంజాబ్ లో గతవారం ఖురాన్ ను అవమానించారని జరిగిన ఘర్షణల వెనక మాస్టర్ మైండ్ గా పేర్కొంటూ ఆపార్టీ ఎమ్మెల్యే నరేష్ యాదవ్ పై పంజాబ్ పోలీసులు కేసును నమోదు చేశారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న విజయ్ కుమార్ తాను నరేష్ యాదవ్ ప్రోద్బలంతోనే మత ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నించానని, ఇందుకు  తనకు ఎమ్మెల్యే కోటి రూపాయలు ఇస్తానన్నారని  పోలీసులకు తెలిపాడు. నరేష్ యాదవ్ ఢిల్లీలోని దక్షిణ మొహ్రాలీ నుంచి ఆప్ ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. గత నెల జూన్ 24 న పంజాబ్ లోని మాలెర్ కొట్లా ప్రాంతంలో ఖురాన్ ప్రతులను డంప్ లో  పడేయంతో  ఆ ప్రాంతంలో మత ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement