మాల్దాలో కూలిన స్కూల్ భవనం | Quake kills two, injures 20 in Bengal | Sakshi
Sakshi News home page

మాల్దాలో కూలిన స్కూల్ భవనం

Apr 25 2015 4:10 PM | Updated on Jul 29 2019 5:43 PM

ఉత్తర, ఈశాన్యభారతాన్ని వణికించిన భూకంపం పశ్చిమబెంగాల్ లోని పలు నగరాల్లో ప్రభావాన్ని చూపించింది. భూ ప్రకంపనలతో జనం భయభ్రాంతులయ్యారు. పలు సంఘటనల్లో ఇద్దరు మృతిచెందగా పలువురికి గాయాలయ్యాయి. మరో ఘటన స్కలూ భవనం కూలి 40మంది విద్యార్థులు గాయపడ్డారు.

బీహార్: భూకంపం ఉత్తర, ఈశాన్య భారతదేశాన్ని వణికించింది. శనివారం సంభవించిన భూప్రకంపనల వల్ల బీహార్లో ఎక్కువగా ప్రాణనష్టం జరిగింది. ఇప్పటి వరకు బీహార్ లో 15 మంది మరణించినట్టు సమాచారం.


బీహార్లోని భగల్పూర్ గోడ కూలిపోవడంతో ఇకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. సీతామాడి, దర్భాంగా, వైశాలిలో భవనాలు కూలిపోవడంతో ముగ్గురు  మరణించారు. బీహార్లో చాలా చోట్ల భూప్రకంపనల ధాటికి ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఆస్తి నష్టం ఏ మేరకు సంభవించిదన్న విషయం ఇంకా తెలియరాలేదు. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా భూప్రకంపనలు వచ్చాయి. ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్టు సమాచారం లేదు.

మాల్దాలోని ఒక స్కూలు భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో  40 మంది  విద్యార్థులు గాయపడ్డారు.  వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement