పుల్వామా’ కుటుంబాలకు కోటి ఎక్స్‌గ్రేషియా

Pulwama slain CRPF families paid over Rs 1cr ex-gratia each - Sakshi

న్యూఢిల్లీ:  పుల్వామాలో ఉగ్రదాడిలో అసువులు బాసిన 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల కుటుంబాలకు సర్వీస్‌ నిబంధనల ప్రకారం ఇప్పటి వరకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించినట్లు భద్రతాదళాధికారి ఒకరు చెప్పారు. వీటితోపాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాను అదనంగా  అందజేస్తామన్నారు. ఇందులో సీఏపీఎఫ్‌కి చెందిన సిబ్బంది విధి నిర్వహణ లో మృతి చెందినపుడు కేంద్రం ప్రకటించే ఎక్స్‌గ్రేషియా కింద రూ.35 లక్షలు, నష్ట నివారణ నిధి కింద రూ.21.50 లక్షలు, ‘భారత్‌ కే వీర్‌’నిధి కింద రూ.15 లక్షలు, ఎస్‌బీఐ పారామిలిటరీ సేవల బీమా నుంచి రూ.30 లక్షలు చెల్లించారు. ‘కొన్ని సంస్థలు జవాన్ల పిల్లల విద్యా బాధ్యతలను తీసుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చాయి’అని ఆయన చెప్పారు. కొన్ని సందర్భాల్లో మృతి చెందిన జవాన్ల కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించాయని, వారు సీఆర్‌పీఎఫ్‌లోని ఉద్యోగాలకూ అర్హులేనన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top