‘భారత్ మాతాకి జై.. సైన్యం వెంటే మేమంతా..’ | Proud of our armed forces for their heroic surgical strikes on terror launch pads | Sakshi
Sakshi News home page

‘భారత్ మాతాకి జై.. సైన్యం వెంటే మేమంతా..’

Sep 29 2016 1:35 PM | Updated on Sep 4 2017 3:31 PM

‘భారత్ మాతాకి జై.. సైన్యం వెంటే మేమంతా..’

‘భారత్ మాతాకి జై.. సైన్యం వెంటే మేమంతా..’

పాకిస్థాన్ ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లపై భారత సైన్యం 'సునిశిత దాడులు' చేయడాన్ని కేంద్ర మంత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులు సమర్థించారు.

న్యూఢిల్లీ: పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లపై భారత సైన్యం 'సునిశిత దాడులు' (సర్జికల్ స్ట్రైక్స్) చేయడాన్ని కేంద్ర మంత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులు సమర్థించారు. దేశం మొత్తం సైన్యం వెనుక నిలబడుతుందని భరోసాయిచ్చారు. సోషల్ మీడియా ద్వారా తమ స్పందన తెలియజేశారు.

ఉగ్రవాద స్థావరాలపై మన సైన్యం జరిపిన దాడి గర్వకారణమని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. తీవ్రవాదానికి మద్దతు మానునోవాలని పలుమార్లు దౌత్యమార్గాల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చినా దాయాది దేశం తన వైఖరిని మార్చుకోలేదన్నారు.

‘భారత్ మాతాకి జై. జాతి యావత్తు సైనం వెనుక ఉంటుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సీనియర్ నటుడు అనుమప్ ఖేర్ ట్వీట్ చేశారు.

పాకిస్థాన్ తీవ్రవాదిలా వ్యవహరిస్తోందని, దానికి తగిన సమాధానం చెప్పాల్సిన అసవరముందని జమ్మూకశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ ఉగ్రవాదుల స్థావరాలపై దాడి భారత్ సైన్యం నైతిక స్థైర్యాన్ని పెంచుతుందని అభిప్రాయపడ్డారు. ‘తీవ్రవాదులలందరికీ ఇది తగిన గుణపాఠం. మమ్మల్ని మేము రక్షించుకునే హక్కు మాకు ఉంద’ని బీజేపీ నాయకుడు షహనవాజ్ హుస్సేన్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement