జమ్మూ కశ్మీర్‌లో ఉగ్ర పంజా.. | Police Post Attacked In  Jammu Kashmir Pulwama Two Policemen Dead | Sakshi
Sakshi News home page

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్ర పంజా..

Jun 12 2018 8:13 AM | Updated on Jun 12 2018 11:18 AM

Police Post Attacked In  Jammu Kashmir Pulwama Two Policemen Dead - Sakshi

సాక్షి, శ్రీనగర్‌ : జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలో మంగళవారం ఉదయం పోలీస్‌ గార్డ్‌ పోస్ట్‌పై సాయుధ ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు మరణించగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. నలుగురు ఉగ్రవాదుల బృందం పోలీస్‌ పోస్ట్‌పై కాల్పులకు తెగబడటంతో ఇరువైపులా జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు ఘటనా స్థలంలోనే మరణించారు. అనంతరం ఉగ్ర బృందం ఘటనాస్థలం నుంచి పరారయినట్టు పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారీ గాలింపు చర్యలు చేపట్టారు.

ఘటనా ప్రాంతాన్ని భద్రతా దళాలు తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. మరోవైపు అనంతనాగ్‌ జిల్లాలోని సదర్‌లో మంగళవారం తెల్లవారుజామున ఉగ్రవాదులు జరినపిన గ్రనేడ్‌ దాడిలో పది మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు గాయాలయ్యాయి.గాయపడిన వారందరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఈ రెండు దాడుల్లో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ ప్రమేయం ఉందని భావిస్తున్నారు. ఉగ్ర దాడుల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో అప్రమత్తమైన భద్రతా దళాలు గస్తీని ముమ్మరం చేశాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement