వైరల్‌: ఇంటిపై ల్యాండింగ్‌.. పైలట్‌ హిరోచితం

Pilot Who Made Rooftop Landing in Kerala - Sakshi

తిరవనంతపురం: కేరళ వరద బాధితులను ప్రాణాలకు తెగించి రక్షించాడు ఓ పైలట్‌. మూడు సెకండ్లు ఆలస్యమైతే ఆ హెలికాప్టర్‌ ముక్కముక్కలయ్యేది. కానీ ఆ పైలట్‌ చాకచక్యంగా వ్యవహరించి 26 మందిని రక్షించాడు. ఈ థ్రిల్లింగ్‌ రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. చాలకుడి ప్రాంతంలోని వరదల్లో చిక్కుకున్న వారి కోసం పైలట్‌ అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించాడు. నావీకి చెందిన 42బీ హెలికాప్టర్‌ను ఇంటిపై(రూఫ్‌టాప్‌) చాకచక్యంగా ల్యాండ్‌ చేసి 26 మంది ప్రాణాలను రక్షించాడు.

మూడు సెకన్లు ఆలస్యమైతే అందరి ప్రాణాలు గాల్లోకలిసేవి. గత శుక్రవారం జరిగిన ఈ ఘటనపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ డేర్‌డెవిల్‌ పైలట్‌ సాహాసాన్ని అందరూ కొనియాడుతున్నారు. ‘ఆ ఇంటిపై హెలికాప్టర్‌ బరువు పడకుండా కేవలం టైర్లు మ్రాతమే ఉండేలా ల్యాండ్‌ చేశా. 8 నిమిషాల్లో సహాయ సిబ్బంది ఆ 26 మందిని హెలికాప్టర్‌లోకి ఎక్కించేశారు.’  ఆ వెంటనే  టేకాఫ్‌ తీసుకున్నానని చెప్పుకొచ్చారు. ఏదైన జరగకూడనిది జరిగితే అని ప్రశ్నించగా.. ‘ఓ మూడు సెకన్లు ఆలస్యమైతే హెలికాప్టర్‌ ముక్కలవుతోందని తెలుసు. అది నాకు కఠిన సవాల్‌. కానీ నేను తీసుకునే నిర్ణయం సరైనదేనని నమ్మాను. ఇలాంటి పరిస్థితుల్లో  పైలట్‌ అవసరమెంటో తెలుస్తోంది.’ అని చెప్పుకొచ్చారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top