భారత్‌కు పెనుముప్పు | Sakshi
Sakshi News home page

భారత్‌కు పెనుముప్పు

Published Thu, Nov 2 2017 11:43 AM

Pakistan's ISI chief meets terrorists - Sakshi

భారత్‌కు పాకిస్తాన్‌ను నుంచి పెనుముప్పు పొంచి ఉందా? మిలిటెంట్లకు ఐఎస్‌ఐ, పాక్‌ ఆర్మీ సహకారాలు అందిస్తోందా? జీవరసాయన ఆయుధాలతో ఉగ్రవాదులు భారత్‌పైకి దాడికి దిగుతారా? అంటే అవుననే సమాధానం వస్తోంది.

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ నవీద్‌ ముక్తార్, ఐఎస్‌ఐ ఇతర ఉన్నతాధికారులు ఈ మధ్యే ఉగ్రవాదులతో ప్రత్యేకంగా సమావేశమయినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని నిఘా సంస్థలు తెలిపాయంటూ ‘టైమ్స్‌ నౌ’ వెల్లడించింది. ఉగ్రవాదులు, ఐఎస్‌ఐ సమావేశంలో ప్రధానంగా జీవరసాయన ఆయుధాలను ఉపయోగించడంపై చర్చించినట్లు సమాచారం. దశాబ్దాల కాలంగా ఉగ్రవాదులకు పాకిస్తాన్‌ సైన్యం, ఐఎస్‌ఐ శిక్షణ, ఆయుధాలు, ఇతర సదుపాయాలను కల్పిస్తోందన్న ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిం‍దే.

భారత నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. అక్టోబర్‌ 9న భాగ్‌ జిల్లాలోని చాకోటి ప్రాంతంలో (పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌) ఐఎస్‌ఐ చీఫ్‌ నవీద్‌,  ఐఎస్‌ఐ ఉన్నతాధికారులు బ్రిగేడియర్‌ హఫీజ్‌ అహ్మద్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌ జావేద్‌ అహ్మద్‌, మేజర్‌ జాఫర్‌ ఆలీ, పాకిస్తాన​ ఆర్మీ కెప్టెన్‌ మన్సూర్‌ ఆలీ, హిజ్బుల్‌ ముజాహిదీన్‌, జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థల నేతలు జుద్దాఖాన్‌, జావేద్‌ అఖ్తర్‌లతో సమావేశమయినట్లు నిఘా వర్గాలు ప్రకటించాయి.

ఈ సమావేశంలో ప్రధానంగా శీతాకాలం వచ్చే లోపు వీలైనంత మంది ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌కు చెందిన 20 మంది సైనికాధికారులు ఇప్పటికే చైనాలో జీవరసాయన యుద్ధాల్లో మెళుకువలు నేర్చుకుంటున్నారని.. వారు తిరిగిరాగానే.. వీరి ద్వారా ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తామని ప్రకటించినట్లు తెలిసింది. ఉగ్రవాదులు జీవరసాయన యుద్ధానికి దిగితే భారత్‌కు భారీ నష్టం కలుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement