
సాక్షి, చండీగఢ్ : పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన విమర్శలు చేసింది. పాకిస్తాన్ గూఢచారి అరూసా ఆలమ్‌కు పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ ఆశ్రయం కల్పించారని ఆప్ పార్టీ నేత సుఖ్‌పాల్ సింగ్ ఖైరా తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో అరూసా ఆలం ప్రస్తుతం బస చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
అరూసా ఆలం గురించిన ఖచ్చతమైన సమాచారంతోనే తాను మాట్లాడుతున్నాని సుఖ్‌పాల్ సింగ్ చెప్పారు. పంజాబ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోనూ.. సుఖ్‌పాల్ సింగ్ ఈ అంశంపైనే ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్‌ను లక్ష్యంగా చేసుకుని రాయడానికి వీలుకాని భాషలో విమర్శలు చేశారు. అసూరా అలంపై కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా సుఖ్‌పాల్ సింగ్ ఖైరా విమర్శలపై తీవ్రంగా స్పందించింది. ఖైరా మతిభ్రమించి మాట్లాడుతున్నారని మంత్రి నవజ్యోత్‌సింగ్ సిద్ధూ అభిప్రాయపడ్డారు.