ధోని, జాకీర్‌ హుస్సేన్‌లకు ‘పద్మ’ నిరాకరణ | 'Padma' rejection to MS Dhoni and Zakir Hussain | Sakshi
Sakshi News home page

ధోని, జాకీర్‌ హుస్సేన్‌లకు ‘పద్మ’ నిరాకరణ

Mar 29 2017 3:44 AM | Updated on Sep 5 2017 7:20 AM

ధోని, జాకీర్‌ హుస్సేన్‌లకు ‘పద్మ’ నిరాకరణ

ధోని, జాకీర్‌ హుస్సేన్‌లకు ‘పద్మ’ నిరాకరణ

ఆధ్యాత్మిక గురువు గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్, ప్రముఖ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని, తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌..

న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక గురువు గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్, ప్రముఖ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని, తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ పేర్లను ఈ ఏడాది పద్మ అవార్డులకు ప్రభుత్వం తిరస్కరించింది. ఇలా నిరాకరణకు గురైన సుమారు 18 వేలకు పైగా సిఫార్సులు, దరఖాస్తుల వివరాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

ఈ జాబితాలో...రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల, గాయకుడు సోను నిగమ్, నటి శ్రీదేవి, ప్రముఖ పాత్రికేయుడు అర్ణబ్‌ గోస్వామి, ఫ్యాషన్‌ డిజైనర్‌ రోహిత్‌ బాల్‌ తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement