వన్ ర్యాంక్ వన్ పెన్షన్(ఓఆర్ఓపీ) అమలు చేస్తూ కేంద్రప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది.
న్యూ ఢిల్లీ: వన్ ర్యాంక్ వన్ పెన్షన్(ఓఆర్ఓపీ) అమలు చేస్తూ కేంద్రప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఓఆర్ఓపీతో 25 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ఐదేళ్లకోసారి పింఛన్లను సవరించనున్నారు. 2014 జూలై ఒకటో తేదీ నుంచి అమలయ్యేలా ఓఆర్ఓపీని అమలుచేయనున్నారు. దీనికి సంబంధించిన బకాయిలను నాలుగు విడతల్లో ఆరేసి నెలలకు ఒకసారి చొప్పున ఇవ్వనున్నారు. యుద్ధ వితంతువులకు మాత్రం ఒకే సారి మొత్తం బకాయిలు ఒకేసారి చెల్లించనున్నారు.
దీనివల్ల ఖజానాపై 8000 కోట్ల నుంచి 10000 కోట్ల వరకు భారం పడనుంది. అలాగే బకాయిల చెల్లింపునకు మరో 10-12 వేల కోట్ల వరకు ఖజానా పై అదనపు భారం పడనుంది.