'అందరూ పాటిస్తేనే విజయవంతం' | OddEvenFormula will only be a success if everyone participate | Sakshi
Sakshi News home page

'అందరూ పాటిస్తేనే విజయవంతం'

Dec 30 2015 11:47 AM | Updated on Sep 3 2017 2:49 PM

'అందరూ పాటిస్తేనే విజయవంతం'

'అందరూ పాటిస్తేనే విజయవంతం'

కాలుష్య నియంత్రణకు సరి-భేసి సంఖ్యల విధానాన్ని ఉద్యమంలా అమలు చేయాలని ప్రజలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.

న్యూఢిల్లీ: కాలుష్య నియంత్రణకు సరి-భేసి సంఖ్యల విధానాన్ని ఉద్యమంలా అమలు చేయాలని ప్రజలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా దీన్ని పాటించాలని కోరారు. అందరూ పాటిస్తేనే ఈ పాలసీ విజయవంతం అవుతుందన్నారు. ప్రజలంతా తమ వాహనాల వాడకాన్ని తగ్గిస్తే ఢిల్లీలో కాలుష్యాన్ని గణనీయంగా నియంత్రిచొచ్చని చెప్పారు.

పాఠశాల విద్యార్థులతో బుధవారం ఆయన ముచ్చటించారు. కాలుష్య నివారణకు చర్యలకు తోడ్పడతామని విద్యార్థులతో ప్రమాణం చేయించారు. వీధులను వాక్యూమ్ క్లీనర్లతో శుభ్రపరిచే కార్యక్రమాన్ని ఏప్రిల్ నుంచి అమలు చేయనున్నట్టు కేజ్రీవాల్ తెలిపారు. తూర్పు, పశ్చిమ ఢిల్లీలో రోడ్లు వేసి ఢిల్లీ గుండా వెళ్లే ట్రక్కులను అటువైపు మళ్లిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement