'విద్యార్థుల డిబార్ సరికాదు' | non-teaching staff condemns action against JNU students | Sakshi
Sakshi News home page

'విద్యార్థుల డిబార్ సరికాదు'

Feb 15 2016 6:17 PM | Updated on Sep 3 2017 5:42 PM

ఎనిమిదిమంది విద్యార్థులను ఎలాంటి విచారణ చేపట్టకుండానే జవహార్లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ) డిబార్ చేయడంపట్ల యూనివర్సిటీ బోధేనేతర సిబ్బంది(నాన్ టీచింగ్ స్టాప్) తప్పుబట్టింది

న్యూఢిల్లీ: ఎనిమిదిమంది విద్యార్థులను ఎలాంటి విచారణ చేపట్టకుండానే జవహార్లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ) డిబార్ చేయడంపట్ల యూనివర్సిటీ బోధేనేతర సిబ్బంది(నాన్ టీచింగ్ స్టాప్) తప్పుబట్టింది. కనీసం విచారణ కూడా చేయకుండా విద్యార్థులను చదువుకు దూరం చేయడం భావ్యం కాదని వారు పేర్కొన్నారు.

జేఎన్యూ ఆవరణలో ఈ నెల 9న దేశ వ్యతిరేక నినాదాలు చేశారంటూ ఎనిమిది మంది విద్యార్థులను యూనివర్సిటీ అధికారులు డిబార్ చేశారు. ఇదిలా ఉండగా, ఆ విద్యార్థులపై అలాంటి చర్యలు సరైనవేనంటూ జవహార్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ స్టాఫ్ అసోసియేషన్(జే ఎన్యూఎస్ఏ), జవహర్లాల్ నెహ్రూ ఆఫీసర్స్ అపోసియేషన్ పేర్కొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement