ఆయన యూటర్న్ తీసుకోలేదు: దిగ్విజయ్ | No U-Turn By Rahul Gandhi: Digvijaya Singh Defends Congress Vice-President | Sakshi
Sakshi News home page

ఆయన యూటర్న్ తీసుకోలేదు: దిగ్విజయ్

Aug 25 2016 3:52 PM | Updated on Sep 4 2017 10:52 AM

ఆయన యూటర్న్ తీసుకోలేదు: దిగ్విజయ్

ఆయన యూటర్న్ తీసుకోలేదు: దిగ్విజయ్

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కట్టుబడి ఉన్నారని ఆ పార్టీ కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు.

న్యూఢిల్లి: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పై  చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కట్టుబడి ఉన్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. రాహుల్  యూటర్న్ తీసుకున్నాడని వస్తున్న వార్తలను ఆయన ఖడించారు. ఆర్ఎస్ఎస్ భావజాలమే మహాత్మా గాంధీ హత్యకు కారణమని రాహుల్ చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారని ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకొని ఆయనపై పరువునష్టం కేసు వేశారని అన్నారు. గతంలోరాహుల్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఆర్ఎస్ఎస్ ఆయన పై పరువు నష్టం దావా వేసింది. దీనిపై రాహుల్ సుప్రీం కోర్టులో బుధవారం అఫిడవిట్ దాఖలు చేశారు. కేసును వాదిస్తున్న మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ కేసును సెప్టెంబర్ 1 వరకు వాయిదా వేయమని కోరిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement