
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి రానందున మరో వారం పాటు లాక్‌డౌన్ మినహాయింపులివ్వడం సాధ్యంకాదని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. దేశ జనాభాలో ఢిల్లీ జనాభా 2 శాతం మాత్రమే ఉండగా, దేశంలోని మొత్తం కోవిడ్–19 కేసుల్లో, 12 శాతం ఢిల్లీలోనే ఉన్నాయని కేజ్రీవాల్ వివరించారు. అయితే రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందని ఆయన చెప్పారు.