నగదు రూపంలో ఫీజులు వద్దు: కేంద్రం | Sakshi
Sakshi News home page

నగదు రూపంలో ఫీజులు వద్దు: కేంద్రం

Published Thu, Jun 8 2017 1:50 AM

No fees in the form of cash: central government

న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో ఫీజుల్ని నగదు రూపంలో స్వీకరించరాదని కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి డిజిటల్‌ విధానంలో ఫీజుల్ని చెల్లించే విధంగా మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర మానవవనరుల శాఖ యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ)ను ఆదేశించింది.

క్యాంటీన్‌తో పాటు హాస్టల్‌లో అందిస్తున్న సేవలకు చెల్లింపుల కోసం ‘భీమ్‌’ యాప్‌ను వాడేలా విద్యార్థులను ప్రోత్సహించాలని కేంద్రం సూచించింది. విద్యార్థుల ఫీజుతో పాటు పరీక్ష ఫీజులు, ఉద్యోగులకు జీతాలతో పాటు వ్యాపారులకు చెల్లింపుల్ని డిజిటల్‌ రూపంలోనే చేయాలని తెలిపింది. ఇందుకోసం ఓ నోడల్‌ అధికారిని నియమించి యూజీసీకి నెలవారీ నివేదికలు పంపాలని విశ్వవిద్యాలయాలను ఆదేశించింది.  

Advertisement

తప్పక చదవండి

Advertisement