‘యువత ఓలా, ఉబర్‌లనే ఎంచుకుంటున్నారు’

Nirmala Sitharaman Says Millennials Preference For Uber And Ola Cabs Over New Cars - Sakshi

చెన్నై : ఆధునిక యువత కొత్త కార్లను కొనుగోలు చేసి ఈఎంఐల భారం మోసేందుకు ఇష్టపడటం లేదని, ఓలా..ఉబర్‌ క్యాబ్స్‌ను ఆశ్రయిస్తున్నారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. మిలీనియల్స్‌ క్యాబ్‌లకే మొగ్గుచూపడంతో ఆటోమొబైల్‌ పరిశ్రమ ఒడిదుడుకులకు లోనవుతోందని చెప్పారు.కార్లు, ద్విచక్రవాహన విక్రయాలు ఇటీవల గణనీయంగా తగ్గుముఖం పట్టిన సంగతి తెలసిందే. ఆటోమొబైల్‌ రంగంలో సంక్షోభాన్ని సమర్ధంగా చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చురుగ్గా వ్యవహరిస్తోందని ఆమె చెప్పుకొచ్చారు. భారత్‌ 6 ప్రమాణాలు, రిజిస్ట్రేషన్‌ రుసుము అంశాలతో పాటు యువత ఎక్కువగా క్యాబ్‌లు, మెట్రో రైళ్లపై ఆధారపడటంతో కూడా ఆటోమొబైల్‌ రంగంలో సమస్యలు ఎదురవుతున్నాయని వీటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి వంద రోజులైన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఆటో సంక్షోభం సమసిపోయేందుకు ప్రభుత్వం అన్ని రంగాల నిపుణులతో సంప్రదింపులు జరుపుతోందని, ఢిల్లీయే కాకుండా దేశవ్యాప్తంగా సమాచారం క్రోడీకరిస్తోందని తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top