
న్యూఢిల్లీ: పెద్ద ఎత్తున మనీలాండరింగ్‌కు పాల్పడే మావోయిస్టు నేతలు, వారి సానుభూతిపరులపై జాతీయ పరిశోధన సంస్థ(ఎన్‌ఐఏ)దృష్టి సారించింది. వీరి కార్యకలాపాలపై విచారణకు గాను ఎన్‌ఐఏలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర హోం శాఖ ఇటీవల ఇందుకు ఆమోదం తెలిపింది. జార్ఖండ్ మావోయిస్టు నేత సందీప్ యాదవ్‌కు చెందిన రూ.86 లక్షల ఆస్తులను గత ఫిబ్రవరిలో ఈడీ అటాచ్ చేసింది. బిహార్‌కు చెందిన ప్రద్యుమ్న శర్మ, ప్రమోద్‌శర్మ అనే సీనియర్ మావోయిస్టు నేతలకు చెందిన సుమారు రూ.68 ఆస్తులను కూడా మనీలాండరింగ్ కేసులో అటాచ్ చేసిన నేపథ్యంలో ఈ ప్రత్యేక విభాగం ఏర్పాటైంది.