మోదీ సభపై ‘పంట’ దుమారం | Narendra modi to visit Madhaya Pradesh on Crops insurance scheme programme | Sakshi
Sakshi News home page

మోదీ సభపై ‘పంట’ దుమారం

Feb 11 2016 5:11 AM | Updated on Aug 15 2018 2:20 PM

కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన పంటల బీమా పథకంపై మధ్యప్రదేశ్‌లో ఈ నెల 18న జరగనున్న కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉంది.

సెహోర్: కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన పంటల బీమా పథకంపై మధ్యప్రదేశ్‌లో ఈ నెల 18న జరగనున్న కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో షేర్‌పూర్ గ్రామంలో నిర్మించనున్న వేదిక చుట్టుపక్కల ఉన్న పంటలను కోసేయాలని ఒత్తిడి జరుగుతోందని షేర్‌పూర్ రైతులు ఆరోపిస్తున్నారు.

అయితే అలాంటిదేమీ లేదని బీజేపీ ఖండిస్తోంది. ‘మా పచ్చని గోధుమ పంటను కోసేయాల్సిందిగా ఓ అధికారి అడిగారు. ఇంకా ఆ పంట పూర్తిగా ఎదగలేదు కూడా. పంట పోతే లక్షల రూపాయలు నాకు నష్టం వాటిల్లుతుంది’ అని సురేశ్ పరమర్ అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement