వైష్ణోదేవి ఆలయానికి వెళ్లడం ఇక సులభం!! | narendra modi flags off train to katra | Sakshi
Sakshi News home page

వైష్ణోదేవి ఆలయానికి వెళ్లడం ఇక సులభం!!

Jul 4 2014 10:31 AM | Updated on Aug 15 2018 2:20 PM

వైష్ణోదేవి ఆలయానికి వెళ్లడం ఇక సులభం!! - Sakshi

వైష్ణోదేవి ఆలయానికి వెళ్లడం ఇక సులభం!!

వైష్ణోదేవి ఆలయానికి వెళ్లడానికి, సాహస యాత్రలు చేయడానికి బేస్ క్యాంపు అయిన కట్రాకు ఎట్టకేలకు రైలు మార్గం మొదలైంది.

వైష్ణోదేవి ఆలయానికి వెళ్లడానికి, సాహస యాత్రలు చేయడానికి బేస్ క్యాంపు అయిన కట్రాకు ఎట్టకేలకు రైలు మార్గం మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన జమ్ము కాశ్మీర్ పర్యటన సందర్భంగా ఈ మార్గంలో తొలి రైలును ప్రారంభించారు. ఈ రైలు వల్ల వైష్ణోదేవి ఆలయానికి వెళ్లడానికి భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. ఈ రైలు వెళ్లే మొత్తం మార్గంలోని 25 కిలోమీటర్ల మార్గంలో పది సొరంగాలు ఉన్నాయి. ఈ రైలుకు శ్రీశక్తి ఎక్స్ప్రెస్ అని నామకరణం చేయొచ్చని ప్రధాని మోడీ సూచించారు.

ముందుగా జమ్ముకు ప్రత్యేక విమానంలో వెళ్లిన మోడీ.. అక్కడినుంచి హెలికాప్టర్లో కట్రాకు వెళ్లారు. అక్కడే కట్రా నుంచి ఉధంపూర్ మీదుగా ఢిల్లీకి వెళ్లే రైలును ఆయన ప్రారంభించారు. ఈ పర్యటనలో మోడీ వెంట జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఉన్నారు. వైష్ణోదేవి ఆలయానికి ప్రతియేటా దాదాపు 50 లక్షల మంది వెళ్తుంటారు. దాంతో ఈ మార్గంలో వెళ్లే రైలుకు మంచి డిమాండు ఉంటుందని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. కాశ్మీరుకు మిగిలిన భారతదేశంతో రైలు మార్గంతో అనుసంధానం చేయాలన్న ప్రాజెక్టులో ఒక భాగమే ఈ ఢిల్లీ- కట్రా రైలు. ఇక కట్రా రైల్వేస్టేషన్ మొత్తం సౌరవిద్యుత్ తోనే పనిచేస్తుంది. ఇది పూర్తిగా పర్యావరణ అనుకూల స్టేషన్. దేశంలోనే ఇలా పూర్తి సౌరవిద్యుత్తుతో పనిచేస్తున్న స్టేషన్ ఇదే మొదటిది.

Advertisement
 
Advertisement
Advertisement