రైలు ప్రమాదంపై వెంకయ్య దిగ్భ్రాంతి | Naidu mourns deaths in UP rail tragedy | Sakshi
Sakshi News home page

రైలు ప్రమాదంపై వెంకయ్య దిగ్భ్రాంతి

Nov 20 2016 6:13 PM | Updated on Sep 4 2017 8:38 PM

రైలు ప్రమాదంపై వెంకయ్య దిగ్భ్రాంతి

రైలు ప్రమాదంపై వెంకయ్య దిగ్భ్రాంతి

ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన రైలు ప్రమాదంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

పనాజి: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన రైలు ప్రమాదంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోవాలోని శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ ఆడిటోరియంలో జరుగుతున్న 47వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా(ఐఐఎఫ్‌ఐ) వేడుకలకు హాజరైన ఆయన రైలు ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు.

’ఉత్తరప్రదేశ్‌లో విచారకరమైన సంఘటన జరిగింది. ఘోర రైలు ప‍్రమాదంలో వంద మందికి పైగా ప్రజలు విలువైన ప్రాణాలను కోల్పోయారు. వారి కోసం ఒక నిమిషం మౌనం పాటిద్దాం’ అని వెంకయ్యనాయుడు మృతులకు సంతాపం తెలిపారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారు జామున 3:30 గంటల ప్రాంతంలో ఇండోర్-పాట్నా ఎక్స్‌ప‍్రెస్‌ 14 బోగీలు పట్టాలు తప్పడంతో 100 మందికి పైగా మృతి చెందగా.. 150 మంది గాయపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement