మోదీ చర్యలు అభినందనీయం: నడ్డా

Nadda praises PM Modi leadership asks party workers to give up one meal - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: కరోనా కట్టడికి ప్రధాని నరేంద్రమోదీ తీసుకుంటున్న చర్యలను అందరూ అభినందిస్తున్నారని భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కొనియాడారు. ఈ విపత్కర పరిస్థితులను మోదీ ఎలా ఎదుర్కుంటారు అని ప్రపంచం మొత్తం ఆయన వైపు చూస్తోందని పేర్కొన్నారు. భారతీయ జనతాపార్టీ 40 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నడ్డా ఈ వ్యాఖ్యలు చేశారు.  

పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రతి బీజీపీ కార్యకర్త 40 మందిని కలిసి ఒక్కొక్కరు రూ. 100 చొప్పున పీఎం కేర్స్‌ ఫండ్‌కి ఇవ్వాల్సిందిగా అభ్యర్థించాలని కోరారు. ప్రజల కోసం పనిచేస్తున్న పోలీసులు, డాక్టర్లు, నర్స్‌లు, బ్యాంక్‌ ఉద్యోగులు, పోస్ట్‌మ్యాన్‌లకు మనమందరం కృతజ్ఞతలు తెలిపాలన్నారు.  లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సంఘీభావంగా ఒకపూట భోజనాన్నిత్యజించాలని నడ్డా పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ కూడా పార్టీ వ్యవస్థపక దినోత్సవం సందర్భంగా కార్యకర్తలకు ట్వీట్టర్‌ వేదిక తన సందేశాన్ని అందించారు. (కరోనాను తరిమికొడదాం: మోదీ పిలుపు)

అదేవిధంగా బీజేపీ సీనియర్‌ నేత, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. కేవలం 40 సంవత్సరాల్లోనే భారత ప్రజాస్వామ్య వ్యవస్థకి
భారతీయ జనతా పార్టీ బలమైన స్తంభంలా మారిందని వ్యాఖ్యానించారు. ప్రజల నమ్మకాన్ని బీజేపీ చూరగొందని పేర్కొన్నారు.  1977లో విధించిన అత్యవసర పరిస్థితి తరువాత జరిగినలోక్‌సభ ఎన్నికలలో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌పై ఐక్య పోరాటం చేయడానికి జనతా పార్టీతో విలీనం అయిన జనసంఘ్‌ పార్టీ నాయకులు 1980  లో ఏప్రిల్ 6 న బీజేపీని స్థాపించారు.

చదవండి: దీపయజ్ఞం మన సంకల్పాన్ని చాటింది : మోదీ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top