గేట్‌వే ముట్టడి భగ్నం..

Mumbai Police Foils Protests At Gateway Of India - Sakshi

ముంబై : జేఎన్‌యూ క్యాంపస్‌లో హింసాకాండను వ్యతిరేకిస్తూ ముంబైలోని గేట్‌వే ఆఫ్‌ ఇండియా వద్ద నిరసనలకు దిగిన ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు వారిని ఆజాద్‌ మైదాన్‌లో ఈ కార్యక్రమానికి అనుమతించారు. గేట్‌వే ఆఫ్‌ ఇండియా ప్రాంతాన్ని ఖాళీ చేయాలని, ఈ ప్రాంతంలో ధర్నాకు దిగితే టూరిస్టుల రాకకు అవాంతరాలు ఏర్పాడతాయని ముంబై పోలీసులు ఆందోళనకారులను కోరారు. పోలీసుల సూచనతో ఆజాద్‌ మైదాన్‌లో నిరసనలు చేపట్టేందుకు ఆందోళనకారులు అంగీకరించకపోవడంతో వారిని బలవంతంగా ఆజాద్‌ మైదాన్‌కు తరలించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.  ఆ తర్వాత గేట్‌వే ఆఫ్‌ ఇండియా ప్రాంతాన్ని నిరసనకారులు ఖాళీ చేశారని పోలీసులు తెలిపారు. గేట్‌వే ఆఫ్‌ ఇండియా వద్ద ఆందోళనలతో ఆ ప్రాంతానికి దారితీసే రోడ్లు బ్లాక్‌ కావడంతో సగటు ముంబై వాసి సహా టూరిస్టులు ఇబ్బందులు ఎదుర్కొనే క్రమంలో ఆజాద్‌ మైదాన్‌కు నిరసనకారులను తరలించడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

చదవండి : జేఎన్‌యూ విద్యార్ధి సంఘం నేతపై కేసు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top